చంద్రశేఖరపురం మండలంలో వడగళ్ల వాన

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలో సోమవారం సాయంకాలం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రెండు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.