శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్‌కు టెండర్లు ఖరారు
HYD: శామీర్‌పేట కారిడార్‌కు టెండర్లను HMDA ఖరారు చేసింది. పారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులకు శ్రీకారం చుట్టింది. KNR, బెక్రాం సంస్థలు టెండర్లు వేయగా సాంకేతిక, ఫైనాన్స్ బిడ్లు పరిశీలించిన అనంతరం ఓ సంస్థను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు నిధులను సమకూర్చుతున్న న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు తుది పరిశీలనకు HMDA పంపినట్లు సమాచారం.