నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమం

యాదాద్రి: బొమ్మలరామారంలో క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి జి.వెంకటేష్ మంగళవారం రైతులకు నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై అవగాహన కార్యక్రమం గ్రామానికి చెందిన రైతు ఎ.రమేష్ పొలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జి.వెంకటేష్ మాట్లాడుతూ.. నానో యూరియాను ఎకరాకు 500 మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసి వాడుకోవచ్చని తెలిపారు.