5G ఫోన్లతో పనులు వేగవంతం: మంత్రి
NDL: నంద్యాలలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం వీవోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను వేగంగా ప్రజలకు చేరవేయడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని, సాంకేతికత వినియోగంతో పనులు త్వరగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.