VIDEO: పెద్దపులి సంచారం.. చాటింపుతో ప్రచారం
KKD: ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్ కుశరాజు, ఆస్ఐలు పొన్నాళ్లు గ్రామాల్లో చాటింపు వేయించారు. గ్రామస్థులు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం లేకుండా రాత్రి సమయంలో బయటకు రావద్దని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని హెచ్చరించారు.