నేడు మిడ్జిల్‌లో ఉచిత ఎఫ్‌ఎండీ టీకాలు

నేడు మిడ్జిల్‌లో ఉచిత ఎఫ్‌ఎండీ టీకాలు

MBNR: మిడ్జిల్ మండల ప్రాథమిక పశువైద్య కేంద్రంలో ఇవాళ ఉచిత గాలికుంటు (ఎఫ్‌ఎండీ) వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు డా. శివరాజ్ తెలిపారు. ఈ అంటువ్యాధి పశువులకు సోకితే పాల దిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందని చెప్పారు. మూడు నెలలు దాటిన గేదెలు, గోజాతి పశువులకు ఏడాదిలో రెండుసార్లు టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు.