వాసవీ కన్యకా పరమేశ్వరీకి ప్రత్యేక పూజలు

NDL: నంద్యాల పట్టణం నూనెపల్లె వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీకి కుంభాభిషేక మహోత్సవం గట్టాభిషేక మహోత్సవం జరిపించారు. చెరువు కట్ట నుంచి 1500 కలశాలతో గంగా జలాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.