పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

ATP: బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని పంట పొలాలలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర్ మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్నారని తమకు రాబడిన సమాచారంతో ఈ దాడులు చేశామన్నారు. 6 మంది పేకాట రాయుళ్ళను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 36,020 నగదు, 10 బైకులు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.