వేసవిలో మేడపై నిద్రించేవారు తస్మాత్ జాగ్రత్త!

వేసవిలో మేడపై నిద్రించేవారు తస్మాత్ జాగ్రత్త!

RR: వేసవి కాలం వేడి నుంచి ఉపశమనం కోసం నగరంలో భవనాలపై నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  భవనంపై నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, మహిళలు నగలను, ఫోన్లను భద్రపరుచుకోవాలని, ముఖ్యంగా పిల్లలు నిద్రలో లేచి కింద పడే ప్రమాదం జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇంటి తలుపులు సరిగ్గా వేసి, అప్రమత్తంగా ఉండటం మంచిదని పేర్కొన్నారు.