ఆలయం వద్ద షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన
AKP: మాడుగుల శ్రీదేవి ఆలయం వద్ద షెల్టర్ నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షులు శ్రీనాథు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భక్తులకు నీడ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ షెల్టర్ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారి పాల్గొన్నారు.