బాల్య వివాహాలు చేస్తే చర్యలు: నారాయణ

TPT: బాల్య వివాహలు చట్ట రీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కౌన్సిలర్ ఎంఏ నారాయణ పేర్కొన్నారు. వెంకటగిరిలోని 4వ వార్డు కుమ్మరిమిట్టలోని అంగన్వాడీ స్కూల్లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని నారాయణ తెలిపారు.