కోడుమూరులో CMRF చెక్కుల పంపిణీ
KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ఇవాళ రూ. 5,14,983 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పంపిణీ చేశారు. పసుపుల గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.