ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన
TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత రెండు రోజులుగా దేశ రాజధానిలో పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీలు, అధికారిక సమావేశాల్లో పాల్గొన్న ఆయన, తాజాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా రాజ్యసభ రెన్యూవల్ సందర్భంగా సింఘ్వీ ఇచ్చిన విందులో ఖర్గే, రాహుల్ గాంధీతో కలిసి సీఎం పాల్గొన్నారు.