పాఠశాల విద్యార్థులకు గ్లాసులు పంపిణీ

SRPT: నడిగూడెం మండలం సిరిపురం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు శుక్రవారం హెచ్ఎం.ప్రవీణ దాత అందించిన గ్లాసులను పంపిణీ చేశారు. కోదాడ పట్టణానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం. జయప్రద 70 మంది విద్యార్థులకు రాగి జావను తీసుకునేందుకు వీలుగా స్టీల్ గ్లాసులను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా దాతను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.