సదరం షెడ్యూలు విడుదల
SRD: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ ఏప్రిల్ నెల సదరం శిబిరాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లో ఆసుపత్రిలో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. శిబిరం కోసం ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, హాజరయ్యే వారు సదరం రశీదు, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.