'సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం'

KMM: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ఆయనను కలిసి తమ డిమాండ్లపై చర్చించింది. ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని భట్టి తెలిపారు.