బావిలో గల్లంతైన యువకుడి శవం లభ్యం..!

బావిలో గల్లంతైన యువకుడి శవం లభ్యం..!

GDWL: మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చెందిన జయరాజు అనే బాలుడు ఆదివారం ఈత కోసం బావిలోకి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న మల్దకల్ పోలీసులు వెంటనే స్పందించి గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర ప్రయత్నాల తర్వాత బాలుడి మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.