VIDEO: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని పుష్కర ఘాట్‌లోకి లారీ
GDWL: దారి తప్పి గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటే లారీని పుష్కర ఘాట్‌లోకి లాక్కుపోయింది. ఆత్మకూరు నుంచి గద్వాల వైపు వెళ్తూ రోడ్డు మార్గం అర్థం కాకపోవడంతో లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్‌ని అనుసరిస్తున్నాడు. టర్న్ మిస్ కావడంతో నది వైపు వెళ్తుండగా వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, జేసీబీ సహాయంతో లారీని రోడ్డుపైకి తీసుకువచ్చారు.