విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం అర్జున వలస పంచాయతీలో శ్రీ బంగారమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన విజేతలకు గురువారం ఎమ్మెల్యే ఈశ్వరరావు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.