విద్యుత్ స్తంభం నేలకొరిగి జీవాలు మృతి

KDP: మైదుకూరు మండలంలోని సోమయాజులపల్లె సమీపంలో శుక్రవారం విద్యుత్ స్తంభం నేలకొరిగి మీద పడడంతో 10 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో రూ.1,50,000 వరకు నష్టం వాటిల్లిందని బాధితురాలు రుక్మిణమ్మ వాపోయింది. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుత్ అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు.