14న అగ్రికల్చర్ గురుకుల ప్రవేశానికి కౌన్సెలింగ్
TG: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ జరుగుతుందని సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. వివరాలకు https://www.pjtau.edu.in, http://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.