'గ్రంథాలయాలు సామాజిక పురోగతికి కీలక స్తంభాలు'
NTR: విజయవాడలోని ఠాగూర్ మెమోరియల్ డిస్ట్రిక్ట్ లైబ్రరీని 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా సందర్శించారు. గ్రంథాలయాలు సామాజిక పురోగతికి కీలకమని, యువతకు వాటి ప్రాముఖ్యతను గుర్తుచేస్తాయని ఆయన తెలిపారు. భారతీయ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ వారసత్వాన్ని ఆయన ప్రస్తావించారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.