రాష్ట్ర దీనస్థితికి రాహులే కారణం: KTR

రాష్ట్ర దీనస్థితికి రాహులే కారణం: KTR

TG: అధికారంలోకి వస్తామనే నమ్మకం లేక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అడ్డమైన హామీలిచ్చిందని మాజీమంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. రేవంత్ కంటే చేతకాని పాలకుడు ఇంకొకరు ఉండరని అర్థమైందని అన్నారు. దొంగ చేతికి తాళం ఇచ్చి రాష్ట్రానికి చిప్ప వచ్చేలా చేసింది రాహుల్ గాంధీనే అని ధ్వజమెత్తారు.