కంపెనీ సెక్రటరీ కోర్సులకు భారీడిమాండ్: వీసీ
MBNR: పాలమూరు యూనివర్సిటీలో పీయూలో కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ & ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఐసీఎస్ఐ సహకారంతో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ ప్రొ. జీ.ఎన్. శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల కోసం భారీ స్థాయిలో డిమాండ్ ఉందని ఆయన తెలిపారు.