ఫర్నిచర్ షాప్ దగ్ధం.. రూ.70లక్షల ఆస్తి నష్టం

ఫర్నిచర్ షాప్ దగ్ధం.. రూ.70లక్షల ఆస్తి నష్టం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి 12వ వార్డులో వడ్ల బాలచంద్రంకు చెందిన ఫర్నిచర్ షాప్ గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ షాప్‌లో సుమారు రూ.70లక్షల ఫర్నిచర్ దగ్ధం అయినట్లు బాధితుడు తెలిపారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసిందని లేకపోతే ప్రాణనష్టం జరిగేదని వాపోయారు. బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు