మరో అల్పపీడనం.. రేపు ఎల్లుండి భారీ వర్షాలు
అన్నమయ్య: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఈనెల 17, 18 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.