కాల్పుల ఘటన.. అనుమానితుల ఫొటోలు విడుదల

కాల్పుల ఘటన.. అనుమానితుల ఫొటోలు విడుదల

NZB: ఇందల్వాయి మండలం దేవితండా వద్ద మంగళవారం జరిగిన కాల్పుల ఘటనపై అనుమానితులను స్థానికులు గుర్తించారు. అయితే దేవి తండా పరిసర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు గమనించి ఫొటోలు తీశారు. ఫొటోల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ఇందల్వాయి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.