తొక్కిసలాట ఘటన.. చెక్కులు పంపిణీ చేసిన కేంద్రమంత్రి
AP: కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటన దురదృష్టకరం అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయనతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, MLA గౌతు శిరీష మృతుల కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. వారి కుటుంబానికి జరిగిన నష్టం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు.