ప్రేమ పేరుతో మోసం పోలీసులకు ఫిర్యాదు

NLR: ప్రేమ పేరుతో తనను నంద్యాలకు చెందిన కటారి రమేశ్ అనే వ్యక్తి మోసం చేశాడని కొడవలూరుకు చెందిన మహిళ వాపోయింది. తనను నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను వివాహం చేసుకోకుండా మరొక మహిళతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేసింది.