పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

VZM: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు పాల్గొన్నారు.