నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి
KMM: నేలకొండపల్లి మండలంలోని చెరువు మందారం, కొత్తూరు గ్రామాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను ఇవాళ సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీవో ఎర్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఏర్పాట్లను సమీక్షించి, నామినేషన్ల స్వీకరణ సక్రమంగా జరిగేలా అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు చేశారు.