విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రూ.80 వేల నష్టం.!

విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రూ.80 వేల నష్టం.!

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఓ పాడి గేదె మృతి చెందింది. రైతు మల్లం సుభాష్ రెడ్డికి చెందిన గేదె వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ వైర్‌ను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ. 80 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.