టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తిరుపతిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ.. పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ, ప్రజాసేవే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.