గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
VZM: తెర్లాం ఎస్సై సాగర్ బాబుకు అందిన ముందస్తు సమాచారంతో అడ్డురోడ్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 2.600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. వారిని డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి, నిందితులపై కేసు నమోదు చేశారు.