సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
NTR: అభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలో రూ.76లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఆయన ఆదివారం ప్రారంభించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యంమని తెలిపారు.