యారాడ జెట్టిని పరిశీలించిన ఎమ్మెల్యే
VSP: యారాడలో ఫిషింగ్ జెట్టిని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేటకు వెళ్లే సమయంలో మత్స్యకారులకు ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించి, వారికి పూర్తి భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.