జిల్లా ప్రజలకు అలర్ట్

జిల్లా ప్రజలకు అలర్ట్

KKD: వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది. దీంతో కాకినాడ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వారం రోజులుగా కొత్తపల్లి మండల మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.