VIDEO: మద్యం దుకాణాలపై పోలీసుల ఉక్కుపాదం
అన్నమయ్య: మదనపల్లెలో మద్యం షాపుల వద్ద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి 10 గంటలకే మద్యం దుకాణాల వద్దకు చేరుకుని, నిర్దేశిత సమయానికి షాపులను మూయించారు. పర్మిట్ రూముల్లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న విక్రయాలపై నిఘా పెట్టారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.