పెద్దచెరువు వద్ద భారీ స్థాయిలో మట్టి స్నానాలు

పెద్దచెరువు వద్ద భారీ స్థాయిలో మట్టి స్నానాలు

KMR: యోగాసన స్టోర్స్ అసోసియేషన్, భారత్ స్వాభిమాన్ సంయుక్త ఆధ్వర్యంలో KMR పెద్దచెరువు వద్ద భారీ స్థాయిలో మట్టి స్నానాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నలుమూలల నుంచి ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి వైద్యంలో మట్టి స్నానం ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యోగాసన స్టోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగా రాంరెడ్డి తెలిపారు.