పబ్బతి ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

NGKL: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం మద్దిమడుగు ఆలయ కమిటీ ఛైర్మన్ దేశవత్ రాములు నాయక్, ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి కలిసి శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అర్చకులు పాల్గొన్నారు.