యువకుడి ఊపిరితిత్తులో శనగ గింజ

KMR: వారం రోజులుగా దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని అశ్రయించాడు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులలో శనగ గింజ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణారావు ఆధ్వర్యంలో బ్రాంకోస్కోపీ పరీక్ష ద్వారా ఆ శనగ గింజను మంగళవారం విజయవంతంగా తొలగించారు.