కవిత్వంలో విమర్శించే ఆయుధమే ముషాయిరా: షబ్బీర్ ఆలీ

NZB: రాజకీయ నాయకులకు వారి ముందే వారిని నవ్వుతూ కవిత్వంలో విమర్శించే ఆయుధమే ముషాయిరా అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఎన్నారై కాలనీలో జరిగిన ముషాయిరాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ముషాయిరా ద్వారా బడుగు బలహీన వర్గాల సమస్యలు వారిజీవన విధానం కళ్లకు కట్టినట్లుగా కవులు వినిపిస్తారన్నారు.