వృద్ధురాలిని బెదిరించి బంగారు ఆభరణాల దోపిడి
GNTR: తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన 65 ఏళ్ల మరియమ్మను ఆటో డ్రైవర్ బెదిరించి బంగారు గాజులు, నాణెం దోపిడీ చేసిన ఘటన గుంటూరులో జరిగింది. నంబూరులోని కల్వరి టెంపుల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో ఎక్కిన ఆమెను మార్గమధ్యంలో బెదిరించి ఆభరణాలు దోచుకుని పరారైనట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.