ప్రారంభమైన మూడో విడత పోలింగ్
SDPT: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అక్కన్నపేట్, కొమురవెల్లి, ధూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కల్హేర్, మద్దూర్, కుకునూరుపల్లె, కొండపాక, చెరియల్ మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.