VIDEO: విసన్నపేటలో ప్రమాదం.. ఒకరు మృతి
NTR: విసన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. స్థానికుల వివరాల మేరకు ఓ స్కూటీని లారీ ఢీకొంది. అదే లారీని వెనకనుండి మరో లారీ ఢీకొట్టింది. ఆ వెనుకున్న స్కూల్ బస్ ముందరున్న లారీలను ఢీ కొనడంతో విద్యార్థులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. మృతి చెందిన వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహాదేవ గురుదేవ్ (26)గా పోలీసులు గుర్తించారు.