యువతకు క్రీడా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ వికాస్ కార్యక్రమం కింద ఇందుకూరుపేట మండల యువతకు క్రీడా కిట్లు అందజేసినట్లు ఆమె చెప్పారు. ఇవాళ జిల్లాలో నివాసంలో మండల యువతకు 35 క్రికెట్, 35 వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.