మహిళలను బీజేపీ మోసం చేస్తోంది: కవిత

మహిళలను బీజేపీ మోసం చేస్తోంది: కవిత

TG: మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఈ బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పటం మహిళా లోకాన్ని మోసం చేయటమేనన్నారు. ప్రస్తుతం చేపట్టే జనగణనలో OBC గణన చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కోటా విషయంలో BJP చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బీసీ మహిళలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.