మహిళా క్రికెటర్ ఖాతాలో ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ అమేలియా కెర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషుల, మహిళల విభాగంలో మరెవరికీ సాధ్యంకాని ఘనతను ఆమె సాధించింది. వరుసగా 10 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 30+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచింది. తాజాగా సౌతాఫ్రికాతో పొట్టి సిరీస్‌లో కెర్ 29 బంతుల్లో 31 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించింది.