స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

ATP: పామిడి గ్రామపంచాయతీలో శనివారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి, పామిడి మండలాల టీడీపీ ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.