VIDEO: పాత నేరస్థుల గ్యాంగ్ అరెస్ట్.. కోదాడలో కేసులు..!
సూర్యాపేట: ఆత్మకూరు (ఎస్) మండలం కోటినాయక్ తండాలో వృద్ధురాలి గొంతు నులిమి వెండి గొలుసు దోచుకున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఎస్పీ నరసింహ వివరాల ప్రకారం.. వారి నుంచి రూ.8 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తులైన ఈ ముఠాను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.